వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

May 1 2025 1:59 AM | Updated on May 1 2025 1:59 AM

వాతావరణం

వాతావరణం

ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వడగాలులు బలంగా వీస్తాయి. ఉక్కపోతగా ఉంటుంది.
భూభారతి చట్టంతో భూమిపై హక్కు
● జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాలటౌన్‌: భూభారతి నూతన ఓఆర్‌ఆర్‌ చట్టంతో రైతులకు భూమిపై హక్కు, రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని మైనారిటీ ఫంక్షన్‌ హాలులో బుధవారం భూభారతి నూతన ఆర్‌ఓఆర్‌ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు 15లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతీలాల్‌, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అనిత పాల్గొన్నారు.

రైస్‌మిల్లుల తనిఖీ..

లక్సెట్టిపేట: రైస్‌మిల్లుల యాజమాన్యాలు త్వరితగతిన ధాన్యం అన్‌లోడింగ్‌ చేసుకోవాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం లక్సెట్టిపేటలో రైస్‌మిల్లులను జిల్లా అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతీలాల్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆలస్యం చేయకుండా ఎక్కువ మంది హమాలీలను నియమించుకోవాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement