
లక్కేపూర్ శివారులో మహిళ హత్య
జైపూర్: మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన మహిళ పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్ శివారులో హత్యకు గురైన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పెగడపల్లి గ్రామానికి చెందిన మాసు రమాదేవి (36), సత్యనారాయణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. సత్యనారాయణ గతంలో రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఇంటివద్దే ఉంటున్నాడు. రమాదేవి ఈజీఎస్‌లో మేట్‌గా పనిచేస్తోంది. శుక్రవారం ఉదయం సదరు మహిళ షెట్‌పల్లి గ్రామానికి వెళ్లివస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. శనివారం పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని లక్కేపూర్ శివారులో అనుమానాస్పద స్థితిలో మృతదేహం గుర్తించిన స్థానికులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి శరీరంపై గాయాలు ఉండడంతో లక్కేపూర్‌లో పరిచయం ఉన్న పండుగు మొగిళిపై అనుమానం ఉన్నట్లు సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
● మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో విషాదం