కప్పర్లలో భారీ అగ్నిప్రమాదం
తాంసి: మండలంలోని కప్పర్ల గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగి పశువుల కొట్టం, మూడు మ్యాక్స్ వాహనాలు దగ్ధమైన ఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు బొమ్మని బుచ్చన్న పశువుల కొట్టం గ్రామ శివారులో ఉంది. గ్రామానికి చెందిన పలువురు తమ వా హనాలను సైతం పశువుల కొట్టం దగ్గరే నిలిపి ఉంచుతారు. ఈక్రమంలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పశువుల కొట్టంలో అగ్ని ప్రమాదం జరిగి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో పశువుల కొట్టం పూర్తిగా దగ్ధమైంది. పక్కనే పార్కింగ్ చేసిన మూడు మ్యాక్స్ వాహనాలకు సైతం మంటలు వ్యాపించాయి. రెండు మ్యాక్స్ వాహనాలు పూర్తిగా దగ్ధం కాగా మరొక వాహనం పాక్షికంగా కాలిపోయింది. ఫైర్ ఇంజన్ వచ్చే వరకు గ్రామస్తులు వ్యవసాయ బోర్ మోటార్ ద్వారా నీళ్లను చల్లి మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదంలో పశువుల కొట్టంలో ఉన్న పైపులు, స్పింక్లర్లు, పశుగ్రాసం, వ్యవసా య సామగ్రి, మందులు, ఎరువులు, విద్యుత్ మో టార్లు ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. గ్రా మానికి చెందిన గండ్రత్ కృష్ణకుమార్, గండ్రత్ అభిలాష్, దారుట్ల ప్రవీణ్‌లకు చెందిన మ్యాక్స్ వాహనాలు కాలిపోగా మొత్తంగా రూ.23 లక్షల కు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. అగ్నిప్రమాదం ఘటన స్థలాన్ని ఆర్‌ఐ సంతోష్ పరిశీలించి పంచనామా ని ర్వహించారు. కాగా ప్రభుత్వం తరఫున సాయం అందించి ఆదుకోవాలని రైతు బుచ్చన్న కోరుతున్నాడు. మ్యాక్స్ వాహన యజమానులకు సైతం సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పశువుల కొట్టం దగ్ధం


