మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
మంచిర్యాలఅగ్రికల్చర్: మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి అంజయ్య, సీ్త్రనిధి రీజినల్ మేనేజర్ వెంకటరమణతో కలిసి సీ్త్రనిధి రుణాలు, బ్యాంకు లింకేజ్‌ల మంజూరు, రికవరీపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సీ్త్రనిధి రుణాల లక్ష్యం రూ.42 కోట్లకు గాను 46శాతంతో 19.47 కోట్లు మంజూరు చేశామని, 49శాతం రికవరీ చేశామని అన్నారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, సహాయ ప్రాజెక్టు మేనేజర్లు, సీ్త్రనిధి సిబ్బంది పాల్గొన్నారు.
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ, బాలల సంక్షేమ కమిషన్ చైర్మన్ మహమ్మద్ వహీద్‌తో కలిసి సంక్షేమ శాఖల అధికారులు, పోలీసు, కార్మిక, విద్య, వైద్య–ఆరోగ్యశాఖల అధికారులతో ఆపరేషన్ స్మైల్ అమలుపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బడీడు, బడి మానేసిన పిల్లలు, బాల కార్మికులను పాఠశాలల్లో చేర్పించాలని తెలిపారు. ఈ నెల 31వరకు జిల్లాలో ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా సంక్షేమశాఖ అధికారులు రౌఫ్‌ఖాన్, దుర్గప్రసాద్, భాగ్యవతి, నీరటి రాజేశ్వరి, విద్యాధికారి యాదయ్య, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అనిత, బాలల పరిరక్షణ కమిటీ అధికారి ఆనంద్ పాల్గొన్నారు.
ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి
మంచిర్యాలటౌన్: ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం సీఎం కప్ క్రీడలు 2025లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో టార్చ్ ర్యాలీని ప్రారంభించారు. ప్రతీ గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహించి విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామనొ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఏ.భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, జిల్లా యువజన క్రీడా సేవల శాఖ అధికారి హనుమంతరెడ్డి పాల్గొన్నారు.


