సామాజిక కార్యకర్తలకు పార్టీలు టికెట్లు ఇవ్వాలి
పాతమంచిర్యాల: ప్రజాసమస్యల కోసం పోరా డుతున్న సామాజిక కార్యకర్తలకు రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వాలని తెలంగాణ బలహీన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోతే రాజలింగు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడే సామాజిక కార్యకర్తలే నిజమైన నాయకులని తెలిపారు. డబ్బు, బల ప్రదర్శన, వంశపారంపర్య రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రజాస్వామ్యం బలహీన పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ వేదిక జిల్లా అధ్యక్షుడు గొడిశెల రాజారాం, టీబీఎస్‌ఎస్ సభ్యులు హుస్సెన్, సమ్మయ్య పాల్గొన్నారు.


