సెలవులొచ్చాయ్..
ఎస్సీ బాలుర కళాశాల వసతిగృహం ఎదుట విద్యార్థులు
ఎస్సీ బాలికల కళాశాల వసతిగృహం నుంచి ఇళ్లకు వెళ్తున్న విద్యార్థినులు, బంధువులు
బీసీ సమీకృత వసతిగృహం వద్ద..
మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని వసతిగృహాలు, రెసిడెన్షియల్, కేజీబీవీల్లో పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులకు సక్రాంతి సెలవులు వచ్చాయి. ఈ నెల 10 నుంచి 16వరకు సెలవులు ప్రకటించగా.. శుక్రవారం ఇంటిబాట పట్టారు. ఇళ్లలో సంప్రదాయ పిండివంటలు, ముగ్గులు వేయడం, గాలిపటాలు ఎగురవేయడం వంటి పనులతో సంబరాలు చేసుకోవడం ఆనవాయితీ. శుక్రవారం తెల్లవారు జాము నుంచే కుటుంబ సభ్యులు ఎప్పుడు వస్తారా అని విద్యార్థులు ఎదురుచూశారు. వసతిగృహాల్లో పేరెంట్స్ సమావేశం నిర్వహించి సెలవుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, చదువుపై సూచనలు చేశారు. వారం రోజులు సెలవులతో కావడంతో విద్యార్థులు పుస్తకాలు, సామగ్రితో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లకు వెళ్లారు. ఈ నెల 17న విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్నాయి.
సెలవులొచ్చాయ్..
సెలవులొచ్చాయ్..
సెలవులొచ్చాయ్..


