
కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు సైకిల్‌యాత్ర
నేరడిగొండ: బెంగళూరుకు చెందిన కొట్రెస్ సోలార్ ద్వారా నడిచే సైకిల్‌పై కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు యాత్ర చేపట్టాడు. శనివారం నేరడిగొండ మండలంలోని రోల్‌మామడ టోల్‌ప్లాజ్ వద్ద అతను హైవే పెట్రోలింగ్ పోలీసులకు కనిపించగా పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలని, వెంట ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉంచుకోవాలని సూచించారు.
ఇసుక డంప్ స్వాధీనం
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): జిల్లా అధికారుల ఆదేశాలతో జైనథ్ మండలంలోని పెన్‌గంగా పరీవాహక గ్రామాలపై మండల స్థాయి అధికారులు అప్రమత్తమై ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే తమకు అందిన సమాచారం మేరకు శనివారం ఎస్సై పురుషోత్తం, తహసీల్దార్ నారాయణ, ఆర్‌ఐ ఉల్లాస్ సాంగ్వి, కౌట గ్రామాల మధ్య ఉన్న ఇసుక డంప్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ సుమారు 10 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇసుక విలువ రూ.20వేల వరకు ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు
లక్ష్మణచాంద: ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు వడ్యాల్ గ్రామానికి చెందిన మద్దెల గంగన్న–లక్ష్మి దంపతుల కుమారుడు రామ్‌చరణ్ (14) శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఒంటిగంట సమయంలో కాలనీ పిల్లలతో కలిసి గ్రామ సమీపంలోని చెక్ డ్యాంకు స్నానానికి వెళ్లారు. సాయంత్రమైనా తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆరా తీయగా ఈతకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో చెక్‌డ్యామ్ వద్దకు వెళ్లి చూడగా రామ్‌చరణ్ బట్టలు, పాదరక్షలు కనిపించాయి. చీకటి కావడంతో తిరిగి ఇంటికి వచ్చినట్లు కాలనీవాసులు తెలిపారు.

కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు సైకిల్‌యాత్ర