
ఆందోళన మధ్య ఇళ్ల పట్టాల పంపిణీ
● ఎమ్మెల్యే వినోద్‌ను నిలదీసిన బాధితులు ● అందరికీ న్యాయం చేయాలని ఎమ్మెల్యే ఆదేశం
కాసిపేట: మండలంలోని కేకే ఓపెన్‌కాస్టు నిర్వాసిత గ్రామం దుబ్బగూడెం ప్రజలకు పునరావాస కాలనీలో చేపట్టిన పట్టాల పంపిణీ కార్యక్రమం గురువారం ఆందోళన మధ్య కొనసాగింది. గ్రామంలో పుట్టి పెరిగిన వారికి రాకుండా అధికారులు కుట్ర చే స్తున్నారని బాధితులు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కార్యక్రమంలో నిరసన తెలుపగా.. వే దిక వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మొత్తం 299మందికి పట్టాలు మంజూరు కాగా, 239మందికి పంపిణీ చేశారు. కొందరు మరణించ డం, మరికొందరిపై ఫిర్యాదులు రావడంతో 60 మందికి పంపిణీ నిలిపివేశారు. విచారణ అనంత రం వారికి పంపిణీ చేస్తామని ఆర్డీవో హరికృష్ణ తెలిపారు.
అర్హులందరికీ న్యాయం చేయాలి
సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ గ్రామంలోని అర్హులందరికీ ఇంటిస్థలం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందించి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏడాదిలోపు పునరావాస కాలనీలో అన్ని ఏర్పాట్లతోపాటు నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని తెలిపారు.
ప్రోటోకాల్ రగడ..
గిరిజన మహిళ అని చిన్న చూపా అంటూ పీఏసీ ఎస్ చైర్‌పర్సన్ నీలరాంచందర్ ఎమ్మెల్యేను నిలదీశారు. సొంత పార్టీకి చెందిన తమను పట్టించుకోకుండా, ప్రోటోకాల్ లేకుండా నాయకులను వేది కపైకి పిలవడం, తమను అవమానించడం ఏమిట ని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనుచరులకు వేదికపై స్థానం కల్పించడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే అసంతృప్తి
పట్టాల పంపిణీతో పేరు రావాలని ఈ నెల 11, 16న నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎమ్మెల్యే హాజరవుతారని గురువారం నాటికి వాయిదా వేయించారు. స్థలాలు దక్కని బాధితుల నిరసన, ప్రోటోకాల్ రగడతో సహాయకులతోపాటు నాయకులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా పరిస్థితి ఏమిటి, ఏం కావాలి, ఏం చేయగలం అనేది తెలుసుకోకుండా తనను ర ప్పిస్తారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలి సింది. ఈ కార్యక్రమంలో ఆర్డీవో హరికృష్ణ, జీఏం దేవేందర్, కాంగ్రెస్ నాయకులు రత్నం ప్రదీప్, రౌ తు సత్తయ్య, మైదం రమేష్, గోలేటి స్వామి, దు బ్బగూడెం గ్రామస్తులు పాల్గొన్నారు.