
హెల్ప్‌డెస్క్‌లో సిబ్బంది అందుబాటులో ఉండాలి
మంచిర్యాలటౌన్: పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో సిబ్బంది అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌వో హరీశ్‌రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్‌ను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య సిబ్బందితో మాట్లాడుతూ గర్భిణులు వచ్చినప్పుడు పూర్తి వివరాలు నమోదు చేసుకుని, వైద్యులకు చూపించాలని ఆదేశించారు. ఎంసీహెచ్‌కు వచ్చే జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులకు అవసరమైన వివరాలను తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ప్రియదర్శిని, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ అనిల్ కుమార్, డెమో బుక్క వెంకటేశ్వర్, వెంకటసాయి, తదితరులు పాల్గొన్నారు.