నవ సమాజ నిర్మాణానికి అంబేడ్కర్ కృషి
జన్నారం: నవ సమాజ నిర్మాణానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కృషి చేశారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం రాత్రి ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆనందమేళా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు నృత్య, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ ఒక వర్గానికో మతానికో సంబంధించిన వారు కాదని, అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నేత అంటూ కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న, సీపీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్, ఏఎంసీచైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, ఎంఈవో ఎన్.విజయ్‌కుమార్, ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బాదావత్ ప్రకాష్‌నాయక్, జిల్లా అధ్యక్షుడు రామటెంకి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బు క్య రాజన్న, మండల అధ్యక్షుడు తుంగూరి గోపాల్, ముజఫర్ అలీఖాన్, తదితరులు పాల్గొన్నారు.


