
శుభకార్యానికి వచ్చి మృత్యుఒడికి..
● కారు బోల్తాపడి ఒకరు మృతి
భైంసాటౌన్(ముధోల్): శుభకార్యం నిమిత్తం భైంసాకు వచ్చి తిరిగి వెళ్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో నిర్మల్ మండలం లంగ్డాపూర్‌కు చెందిన సుమన్ (34) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, మృతుని బంధువుల కథనం ప్రకారం.. నిర్మల్‌లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సుమన్ ఆదివారం భైంసాలోని నేతాజీనగర్‌లో ఓ శుభకార్యం నిమిత్తం తన అల్లుడు సాయిచరణ్‌తో కలిసి కారులో వచ్చారు. సోమవారం పార్డి(బి) బైపాస్ మీదుగా నిర్మల్‌వైపు తిరిగి వెళ్తున్న క్రమంలో మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమన్ అక్కడికక్కడే మృతి చెందగా గాయాలపాలైన సాయిచరణ్‌ను అంబులెన్స్‌లో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిర్మల్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనాస్థలిని సీఐ గోపినాథ్, ఎస్సై ఎండీ గౌసుద్దీన్ పరిశీలించారు.