ఉత్తమ రచనలకు ప్రశంస
లక్సెట్టిపేట: న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల జస్టిస్ ఎట్ గ్రాస్ రూట్స్, రోల్ ఆఫ్ డిస్టి క్ జ్యూడీషియరీ అనే అంశంపై స్థానిక మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అసదుల్లా షరీఫ్ రాసిన వ్యాసాలకు మొదటి స్థానం లభించింది. తెలంగాణ న్యా యమూర్తుల అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శనివారం రాత్రి నిర్వహించిన స మావేశంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి పీ ఎస్.నరసింహ ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో హైకోర్టు ఆక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజెపాల్, జస్టిస్ లక్ష్మణ్, తెలంగాణ న్యాయమూర్తుల అసోసియేషన్ అధ్యక్షుడు కె.ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
ఉత్తమ రచనలకు ప్రశంస


