
‘ఒకే దేశం.. ఒకే ఓటు’
దండేపల్లి/లక్సెట్టిపేట: ఒకే దేశం, ఒకే ఓటు ఎంతో అనుకూలమైనదని, విద్యార్థులు జమిలీ ఎన్నికలపై అవగాహన కలిగి ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేష్‌గౌడ్ అన్నారు. సోమవారం ఆయన దండేపల్లి పద్మశాలి భవన్ వద్ద, లక్సెట్టిపేటలోని వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగా హన కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్రాల అ సెంబ్లీలు, లోక్‌సభకు వేర్వేరుగా ఎన్నికలు ని ర్వహించడం వల్ల దేశప్రగతిపై ప్రభావం చూ పుతుందని తెలిపారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణతో అభివృద్ధి వేగం పుంజుకుంటుందని తె లిపారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్, దండేపల్లి మండల అ ధ్యక్షుడు రాజయ్య, నాయకులు ముకేశ్‌గౌడ్, ర వీందర్, సత్తయ్య, శ్రీనివాస్, ప్రభాకర్, శేఖర్, నరేష్ చంద్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.