భీమిని: మండలంలోని వెంకటపూర్ గ్రామ పంచాయతీలో కుటుంబ తగాదాల్లో మామ, బావమరిది దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటపూర్ గ్రామానికి చెందిన చదువుల లక్ష్మణ్ (35) మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్య రోజ అలియాస్ సమతతో గొడవ పడేవాడు. శుక్రవారం కూడా భార్యతో తీవ్రస్థాయిలో గొడవపడ్డాడు. ఈక్రమంలో రోజ తండ్రి పార్వతి రాజేశం, తమ్ముడు పార్వతి అనిల్‌లు లక్ష్మణ్‌పై దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కుమారస్వామి, ఎస్సై గంగారాం తెలిపారు.
కుటుంబ తగాదాల్లో వ్యక్తి మృతి