కాసిపేట: అధికారులు వేధింపులు మానుకోవాలని శుక్రవారం మందమర్రి ఏరియా కాసిపేట 1గనిపై కార్మికులు మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి నిరసన తెలిపారు. కార్మికుల డిమాండ్ మేరకు టీబీజీకేఎస్, ఏఐటీయూసీ యూనియన్‌లు నిరసనకు పిలుపునివ్వగా యూనియన్‌లకు సంబంధం లేకుండా కార్మికులు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. అధికారులు కార్మికులను వేధిస్తూ చార్జీషీట్లు, మెమోలు, సస్పెండ్‌లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులకు పాల్పడుతున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్, ఫిట్ కార్యదర్శి లక్ష్మినారాయణ, టీబీజీకేఎస్ నాయకులు భైరి శంకర్, అఫ్జలోద్దిన్, బానోత్ తిరుపతి, రావుల సతీశ్‌వర్మ, కార్మికులు పాల్గొన్నారు.