వేమనపల్లి: శిలాజాలను తరలిస్తున్న వాహనాన్ని తహసీల్దార్ రమేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం అడ్డుకున్నారు. ప్రాణహిత నది తీరంలో వేల ఏళ్ల నాటి నత్తగుల్ల, తాబేలు, చేప ఆకృతిలోని శిలాజరాళ్లు ఉన్నాయి. శిలాజాలను ఎవరో వాహనంలో తరలించడం గమనించిన స్థానికులు తహసీల్దార్‌కు సమాచారం అందించారు. వెంటనే ఆయన ఆర్‌ఐ ఖాలీక్‌ను సుంపుటం సమీపంలో ఉన్న ప్రాణహిత నదికి పంపి తహసీల్దార్ కార్యాలయానికి వాహనాన్ని తరలించారు. శిలాజాన్ని తీసుకెళ్తున్న వ్యక్తిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను ఆర్కియాలజిస్ట్ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో ఫోన్ మాట్లాడించాడు. శిలాజరాళ్లను భద్రపర్చేందుకు తీసుకెళ్తున్నట్లు నిర్ధారించుకుని వాహనాన్ని వదిలిపెట్టారు.