వేమనపల్లి: ఊరపిచ్చుకల సంరక్షణతో పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుందని నీల్వా యి రేంజ్ అధికారి అప్పలకొండ, డెప్యూటీ రేంజ్ అధికారి రూపేష్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం వద్ద జాతీయ పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకుని చెట్ల కొమ్మలు, భవనాలపై, కార్యాలయాల ఆవరణలో మట్టి పాత్రల్లో నీళ్లు పోసే కార్యక్రమం చేపట్టారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో పిచ్చికలు నీరు, తిండికి అల్లాడుతున్నాయని అన్నారు. నీల్వాయి రేంజ్ పరిధిలోని 20 బీట్‌లలో సిబ్బంది మట్టిపాత్రలు చెట్లపై ఉంచి నీటితో నింపి పక్షుల కోసం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ ప్రమోద్‌కుమార్, ఒడ్డుగూడం ఎఫ్‌ఎస్‌ఓ బేగ్, కొత్తపల్లి ఎఫ్‌బీఓ సోఫియా, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.