ఏరియా స్టోర్స్‌లో రక్షణ చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఏరియా స్టోర్స్‌లో రక్షణ చర్యలు చేపట్టాలి

Mar 20 2025 1:42 AM | Updated on Mar 20 2025 1:40 AM

శ్రీరాంపూర్‌: శ్రీరాంపూర్‌ ఏరియా స్టోర్స్‌లో రక్షణ చర్యలు చేపట్టాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, బ్రాంచ్‌ కార్యదర్శి షేక్‌ బాజీసైదా బుధవారం ఏరియా స్టోర్‌ను సందర్శించి కార్మికులతో మాట్లాడారు. స్టోర్స్‌లోని షెడ్లలో ఎలక్ట్రిక్‌ వైరింగ్‌ అస్తవ్యస్తంగా ఉందని, షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి విద్యుత్‌ ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యం వీడి మరమ్మతులు చేయించాలని అన్నారు. ఏరియా స్టోర్స్‌లో అర్హత గల టెండాల్‌ సూపర్‌వైజర్‌ లేరని, అలా లేకపోవడం వల్ల మందమర్రి ఏరియా స్టోర్స్‌లో ప్రమాదం జరిగి ఓ కార్మికుడు మరణించారని, అయినా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. స్టోర్‌కు వచ్చే మెటీరియల్‌ నాణ్యత ప్రమాణాల పరిశీలనకు సరైన నాణ్యత ప్రామాణికలు లేవని, నామమాత్రంగా అప్రూవల్‌ ఇస్తూ కంపెనీకి రూ.కోట్లు నష్టం కలిగిస్తున్నారని తెలిపారు. ఏరియా స్టోర్స్‌లో తక్షణమే రక్షణపై సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ ఫిట్‌ సెక్రెటరీ కుమారస్వామి, నాయకులు ఎడ్ల సమ్మయ్య, కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ రీజియన్‌ కార్యదర్శి అఫ్రోజ్‌ ఖాన్‌, నాయకులు రాజకుమార్‌, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement