జన్నారం: శాఖాహార జంతువులను లెక్కించడం, వాటిని గుర్తించడంపై అటవీశాఖ సిబ్బందికి ప్రత్యే క్ష శిక్షణ ఇచ్చారు. ఇందన్‌పల్లి రేంజ్‌లో రేంజ్ అధికా రి కారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం అడవి లో పలు ప్రాంతాల్లో అవగాహన కల్పించారు. వన్యప్రాణుల గణనపై హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యుడు ఎల్లం తెలియజేశారు. ప్రతీ బీట్‌లో రెండు కిలోమీటర్ల మేర ట్రాన్సెక్ట్ లైన్ ఏర్పాటు చేసుకుని, లైన్‌లో నేరుగా కనిపించిన జంతువులు, ఆనవాళ్లు, మలం, అడుగులు, చెట్లపై పడిన వెంట్రుకలు తదితర వివరాలను సేకరించి వన్యప్రాణులను లెక్కించాలని రేంజ్ అధికారి తెలిపారు. అన్ని రేంజ్‌లలో శిక్షణ సాగుతుందని తెలిపారు.