
ఇళ్లకు వెళ్లడానికి సిద్ధమైన విద్యార్థులు
బెల్లంపల్లి: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షలు శుక్రవారం ముగిశాయి. బెల్లంపల్లిలోని సంక్షేమ బాలుర గురుకుల విద్యాల యం, సంక్షేమ బాలికల గురుకుల విద్యాల యం, కాసిపేట సంక్షేమ బాలుర గురుకుల వి ద్యాయాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్ష ముగిసే సమయానికి చేరుకున్నారు. సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయంలో విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రిన్సిపాల్ ఐనాల సైదులు ప్ర త్యేక సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఇళ్ల వద్ద పిల్ల లు కాలక్షేపం చేస్తూనే సెల్‌ఫోన్లకు ఆకర్శితులు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా రు. తర్వాత ఆటోలు, టాటా ఏస్ వాహనాలు, కార్లలో విద్యార్థుల వస్తు సామగ్రి, ట్రంక్ పెట్టెలతో ఇంటిబాట పట్టారు.