
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందినట్లు సీఐ బన్సీ లాల్ తెలిపారు. బస్టాండ్‌లోని ఆసిఫాబా ద్‌కు వెళ్లే ప్లాట్‌ఫాం వద్ద వ్యక్తి పడిపోయి ఉండడంతో ప్రయాణికుల సమాచారం మే రకు అక్కడికి వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతదేహం వద్ద అ తనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. మద్యం సేవించి ఎండలో బస్టాండ్‌కు వచ్చి మృతి చెందినట్లు భావిస్తున్నామన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీ గదిలో భద్రపరిచా మన్నారు. వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.