
దస్నాపూర్‌లో తనిఖీ నిర్వహిస్తున్న సీఐ, సిబ్బంది
● ఇద్దరిపై కేసు నమోదు
రెబ్బెన మండలంలో ఇద్దరిపై..
రెబ్బెన: మండలంలో అనుమతి లేకుండా వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఎస్పీ సురేశ్‌కుమార్ ఆదేశాల మేరకు శనివారం మండల కేంద్రంతో పాటు గోలేటిలో ఏకకాలంలో ఫైనాన్స్‌లు, వడ్డీ వ్యా పారుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. గో లేటి టౌన్‌షిప్‌లో పగిడి మహేందర్ వద్ద రెండు బ్లాంక్ చెక్కులు, మండల కేంద్రానికి చెందిన మోడెం సుదర్శన్‌గౌడ్ వద్ద ఒక ప్రామిసరీ నోట్ లభించాయి. అనుమతి లేకుండా అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించి వీరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలో ఇద్దరు వడ్డీ వ్యాపారుల ఇళ్లపై శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పలువురు వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారం మేరకు ఎస్పీ సురేశ్‌కుమార్ సీఐకి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఐ సతీశ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇద్దరు వ్యాపారుల ఇళ్లపై ఏకకాలంలో పోలీసులు దాడులు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనాన్స్‌లు నడుపుతున్నట్లు గుర్తించారు. పట్టణానికి చెందిన ఇద్దరి నుంచి ప్రామిసరీ నోట్లు, 32 వివిధ బ్యాంకుల బ్లాంక్ చెక్కులు, 22 అప్పు ఒప్పంద బాండ్ పేపర్లు సీజ్ చేశారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌కు చెందిన తపాసె శ్రీనివాస్, బ్రాహ్మణవాడకు చెందిన తణుకు దత్తాత్రి వద్ద రూ.14.70లక్షల నగదు సీజ్ చేశారు. ఇద్దరిపై 420 కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఫైనాన్స్ కంపెనీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
కాగజ్‌నగర్‌లో ముగ్గురిపై..
కాగజ్‌నగర్ రూరల్: పట్టణంలో వడ్డీ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై శనివారం అడిషనల్ ఎస్పీ ఆర్ ప్రభాకర్‌రావు, డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. పట్టణంలోని ఓల్డ్‌కాలనీకి చెందిన సాబీర్ ఇంట్లో సోదా చేసి ప్రామిసరీ నోట్లు, నాన్‌జ్యుడీషియల్ బాండ్లు, బ్లాంక్ చెక్కులు, రూ.3,01,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. తైబానగర్‌కు చెందిన చిదిరాల రాజశేఖర్ ఇంట్లో సోదా చేసి ఒక ల్యాప్‌టాప్‌తో పాటు 250 మంది అప్పు తీసుకున్న పత్రాలు, రూ.3,78,600 నగదు స్వాధీనపరుచుకున్నారు. సంతోష్ ఇంట్లో సంతకం లేని చెక్కులు, సంతకం ఉన్న చెక్కులు, నాన్‌జ్యుడీషియల్ బాండ్లు, ఖాళీ జ్యుడీషియషల్ బాండ్లు, బ్యాంకు పాస్ బుక్కులు, ప్రామిసరీ నోట్లు, ఏటీఎం కార్డులు, బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ శంకరయ్య తెలిపారు. అమాయక ప్రజల నుంచి అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధిస్తున్నారని, వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

కాగజ్‌నగర్: పోలీసులతో చర్చిస్తున్న ఏఎస్పీ

రెబ్బెనలో సోదాలు నిర్వహిస్తున్న ఎస్సై
Comments
Please login to add a commentAdd a comment