సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లా కేంద్రం మంచిర్యాల పట్టణ నడిబొడ్డున ఉన్న సర్కారు భూమి అన్యాక్రాంతం అవుతోంది. గత కొంతకాలంగా ప్రై వేటు, ప్రభుత్వ భూమి మధ్య హద్దులపై వివాదం ఉంది. ఇటీవల కొందరు సర్కారు భూమిలోనే చదు ను చేసి నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మంచిర్యాల పట్టణం నడిబొడ్డున ఉన్న కార్మెల్ స్కూల్ వెనకవైపు, రాళ్లవాగుకు సమీపంలో ఉన్న సర్వే నంబరులో 13.09ఎకరాలు ఇనామ్ పట్టా భూ మి ఉంది. ఈ భూమిని ఆనుకునే 283 సర్వేనంబరులో 13.35ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 283/1 సర్వేనంబరులో 1.32లావణి పట్టా ఉంది. 2019 లోనే 283/3 సర్వేనంబరులో 1.25ఎకరాలను ‘నాలా’(వ్యవసాయేతర భూమి)గా చట్టవిరుద్ధంగా మార్చారంటూ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్ శాఖ ఫీజులు, విలువ, జరిమానాలు కలిపి రూ.10లక్షల వరకు విధించింది. గతంలో పలుమార్లు ఫిర్యాదులు వెళ్లగా సర్వే అధికారులు హద్దులు గుర్తించారు. అయితే ఆ హద్దురాళ్లను సైతం దాటి నిర్మాణాలు చేపట్టారు. దీనిపై అప్పట్లోనే అధికారులు ఇళ్ల నిర్మాణాలు కూల్చివేయగా, తాజాగా కొందరు మళ్లీ అక్రమంగా నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ భూ మిలో చదును చేసి తాత్కాలికంగా షెడ్లు వేస్తూ త మ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఈ భూములు ప్రస్తుతం ‘ధరణి’ పోర్టల్‌లో సర్వే 282లోని భూమి ని నోషనల్ ఖాతా ఇళ్ల స్థలాలుగా ఉంది. ఇక 283 సర్వేనంబరు సంబంధించిన భూమి మాత్రం నిషే ధిత జాబితాలో ఉంది. అంతేకాక 283/2 సర్వేనంబరులో మొత్తం 12.03ఎకరాలు ప్రభుత్వ భూమిగానే చూపిస్తోంది.
అధికారులు దృష్టి సారిస్తేనే..
ఇళ్ల స్థలాలు ఉన్న వ్యవసాయ పట్టాభూమి, సర్కా రు భూమి పక్కనే ఉండడంతో చాలా వరకు ప్రభు త్వ భూమిని కబ్జా చేశారు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కు చెందిన వ్యాపారులు ఈ భూమిని ఎప్పుడో త మ కబ్జాలోకి తెచ్చుకున్నారు. తమ సంస్థ పేరుతోనే ప్లాట్లు చేసి అమ్మేశారు. ప్రైవేటు భూమితో సర్కారు భూమిని రోడ్లు తీశారు. ఇళ్లు నిర్మించి అమ్మేశారు. ఇందులో కొన్ని సర్కారు భూమిలోనే నిర్మాణాలు వె లిశాయి. వీటిపై గతంలోనే దీనిపై ఫిర్యాదులు వెళ్లగా, కొత్తగా వెలిసిన నిర్మాణాలను అప్పటి అధికా రులు కూల్చివేశారు. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లా రు. ఇక మిగిలి ఉన్న చోట్ల కూడా మళ్లీ నిర్మాణాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సర్వే అధికా రులు సైతం గతంలోనే హద్దులు గుర్తించారు. ఆ సమయంలోనే 3.08ఎకరాలు కబ్జా చేసినట్లు గుర్తించారు. తర్వాత కూడా ఆ హద్దురాళ్లని సైతం పట్టించుకోకుండా కబ్జా చేస్తున్నారు. ఇప్పటికై నా ఈ భూ ములపై రెవెన్యూ అధికారులు విచారణ చేసి, ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. బహిరంగ మార్కెట్లలో రూ.కోట్లలో విలువ చేసే సర్కారు భూమిపై ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు.
సర్కారు భూమిలో వెలిసిన నిర్మాణం
సర్కారు భూమిగా చూపిస్తున్న హద్దురాయి