బీఆర్‌ఎస్‌ను వీడనున్న ‘పురాణం’ | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ను వీడనున్న ‘పురాణం’

Published Tue, Mar 12 2024 7:30 AM

- - Sakshi

బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు
కాంగ్రెస్‌లో చేరికకు ఏర్పాట్లు
పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్‌

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న నేపథ్యంలో ఆయన అదే బాటలో వెళ్లే యోచన చేస్తున్నారు. ఆయనతోపాటు బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యేను తీసుకెళ్లాలని ప్రయత్నించినా, అందుకు ఆ ఎమ్మెల్యే సిద్ధంగా లేనట్లు తెలిసింది.

గత అసెంబ్లీ ఎన్నికల నుంచే తీవ్ర అసంతృప్తితో ఉన్న ‘పురాణం’, మంచిర్యాలలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేను మార్చితే తనకు అవకాశం ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. అంతకుముందు మరో మారు ఎమ్మెల్సీగా చాన్స్‌ ఇస్తారని అనుకున్నా దక్కలేదు. కార్పొరేషన్‌ పదవి సైతం ఆశించినా రాలేదు. దీనిపై అప్పట్లోనే తన అసంతృప్తి వ్యక్తపర్చారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో స్థానికులకే పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌తో పొసగక, గత ఎన్నికల్లో ముథోల్‌ నియోజకవర్గ ఇన్చార్జీగా పని చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా తూర్పు జిల్లాలో ఆయన ఐదు నియోజకవర్గాల్లో పని చేశా రు. పార్టీ మార్పుపై ‘పురాణం’ను ఫోనులో సంప్రదించగా, అందుబాటులోకి రాలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement