
మాట్లాడుతున్న సూర్యం
● సీపీఐ ఎంఎల్ ప్రజాపంఽఽథా రాష్ట్ర కార్యదర్శి సూర్యం
పాతమంచిర్యాల: ఫాసిస్టు బీజేపీ, నియంతృత్వ బీఆర్‌ఎస్ పార్టీలను ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపఽంథా రాష్ట్ర కార్యదర్శి కే.సూర్యం అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల లబ్ధికోసం లక్షల కోట్ల దేశ వనరులను అదాని, అంబానీలకు కట్టబెట్టారన్నారు. మతోన్మాద చర్యలకు పాల్పడుతున్న బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయకుండా స్వార్థ రాజకీయాలు చేస్తోందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు నంది రామయ్య, జిల్లా కార్యదర్శి జాడి దేవరాజ్, జిల్లా కమిటీ సభ్యులు పురంశెట్టి బాపు, ఉప్పులేటి సురేష్, చింతపురి బాపురావు, టి.రమాదేవి, అశోక్, ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment