కొయ్య కొరత తీర్చేలా... బొమ్మల తయారీకి ఊతమిచ్చేలా | - | Sakshi
Sakshi News home page

కొయ్య కొరత తీర్చేలా... బొమ్మల తయారీకి ఊతమిచ్చేలా

Jun 27 2023 12:18 AM | Updated on Jun 27 2023 9:06 AM

పొనికి కర్రతో నిర్మల్‌ బొమ్మలు తయారు చేస్తున్న కళాకారులు - Sakshi

పొనికి కర్రతో నిర్మల్‌ బొమ్మలు తయారు చేస్తున్న కళాకారులు

నిర్మల్‌ఖిల్లా: నిర్మల్‌ అనగానే మొదట గుర్తొచ్చేది కొయ్యబొమ్మలే..వీటి తయారీ పరిశ్రమ కొలువుదీరింది ఇక్కడే. పొనికి చెట్టు నుంచి తీసే కలప ముడిసరుకుతో ఈ బొమ్మలను కళాకారులు తయారు చేస్తారు. ఈ కర్ర మృదువుగా, తేలికగా ఉపయోగించవచ్చు. ప్రస్తుతం అడవుల్లో పొనికి చెట్లు కనుమరుగవడంతో జిల్లాలో గత ఐదారేళ్లుగా బొమ్మల తయారీ పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. దాదాపు 150 కళాకారుల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పొనికి మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టింది. ఈ మేరకు మొక్కల పెంపకానికి అనువైన ప్రాంతాలను అధికారులు గుర్తించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా సంరక్షణ చర్యలు చేపడుతున్నారు.

పొనికి కర్ర ప్రత్యేకం..
నిర్మల్‌ కొయ్యబొమ్మల తయారీకి ఉపయోగించే పొనికి చెట్టు నుంచి తీసిన కలప చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ పొనికి కర్ర తేలికగా సరళంగా ఉండి, బొమ్మను చెక్కే క్రమంలో మృదువుగా ఉంటుంది. బొమ్మల తయారీలో కళాఖండంగా తీర్చుదిద్దవచ్చు. అందుకే పొనికి కర్రను వినియోగిస్తామని కళాకారులు అంటున్నారు.

పొనికి మొక్కల పెంపునకు అనువైన ప్రాంతాలు..
పొనికి మొక్కల పెంపకం కోసం ప్రయోగాత్మకంగా పలు గ్రామ పంచాయతీలను డీఆర్డీఏ, ఇతర అధికారులు ఎంపిక చేశారు. మట్టి నమూనా పరీక్ష ల ఆధారంగా మామడ మండలం కొరిటికల్‌, గా యిద్‌పెల్లి, మొండిగుట్ట, తాండ్ర, వాస్తాపూర్‌, లింగాపూర్‌, తోటిగూడ, రాయదారి, సారంగాపూర్‌ మండలం గోపాల్‌పేట్‌ సమీపంలోని అటవీప్రాంతం అనువైనవిగా గుర్తించారు. ఇప్పటికే మట్టికి భూసార పరీక్ష అనంతరం ఇక్కడ మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు.

రాయదారి సమీపంలో 500 మొక్కలు నాటారు. మొదటగా లింగాపూర్‌ శివారులోని ప్రభుత్వ భూమిలో హరితహారం కింద వెయ్యి పొనికి మొక్కలు నాటారు. వాస్తాపూర్‌, గాయిద్‌పెల్లి తదితర గ్రామాల్లో దశలవారీగా మొక్కల పెంపకం చేపట్టనున్నారు. సారంగాపూర్‌ మండలం గోపాల్‌పేట సమీపంలో మహబూబ్‌ ఘాట్స్‌ ప్రాంతంలో 2,200 మొక్కలు నాటారు. నీటి వసతి కోసం ప్రత్యేకంగా డీఆర్డీఏ అధికారులు బోర్‌వెల్‌ వేయించారు.

మొక్కలు నాటించాం
పొనికి కర్రకు తీవ్రమైన కొరత ఏర్పడిన విషయాన్ని గుర్తించాం. జిల్లా కలెక్టర్‌ ప్రోత్సాహంతో హరితహారంలో మొక్కల ప్లాంటేషన్‌ను పకడ్బందీగా చేపడుతున్నాం. కొన్ని ప్రాంతాలను గుర్తించి మొక్కలు నాటించాం. సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం.
– కె.విజయలక్ష్మి,

జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి హర్షణీయం
పొనికి కలపతో తయారీ చే సిన కొయ్య బొమ్మలు ఎక్కువకాలం మన్నిక ఉంటాయి. వీటి తయారీపై ఆధారపడిన కళాకారుల కుటుంబాలు క ర్ర కొరతతో ఇబ్బంది పడ్డాం. రాష్ట్ర ప్రభుత్వం, డీ ఆర్‌డీఏ అధికారులు జిల్లాలో పొనికి వనాల పెంప కం చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం.
– నాంపల్లి రాజశేఖర్‌వర్మ,  కళాకారుడు, నిర్మల్‌

అడవుల్లో సహజసిద్ధంగా పెరిగే పొనికి చెట్టు1
1/3

అడవుల్లో సహజసిద్ధంగా పెరిగే పొనికి చెట్టు

మామడ మండలంలో పొనికి మొక్కలు నాటుతున్న అధికారులు2
2/3

మామడ మండలంలో పొనికి మొక్కలు నాటుతున్న అధికారులు

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement