ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా బదిలీ
కైలాస్‌నగర్: ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికా రి ఖుష్బూ గుప్తా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ప్రసూతి సెలవులో ఉన్న ఆమెను మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె తొలుత ఆదిలా బాద్ స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. 2024 ఫిబ్రవరిలో ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా బదిలీ అయిన ఆమె అదే ఏడాది నవంబర్ 4నుంచి ప్రసూతి సెలవుపై వెళ్లారు. ఈ ఏడాది మే 3వరకు ఆమెకు ప్రభుత్వం సెలవు మంజూరు చేసినా తాజాగా జిల్లా నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో పీవోగా కొత్త అధికారులెవరిని ఇంకా నియమించలేదు. ప్రస్తుతం ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ ఇన్‌చార్జి పీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.


