నిధులు వస్తేనే ఊరట
పట్టణాల్లో పేరుకుపోయిన సమస్యలకు నిధులు వస్తేనే నూతన పాలకవర్గాలకు ఊరట కలుగనుంది. జిల్లా కేంద్రం కార్పొరేషన్ మినహా బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతనపల్లి, లక్సెట్టిపేట, మందమర్రి మున్సిపాలిటీలకు సొంతంగా నిధులు అంతంత మాత్రమే. పన్నులు, లైసెన్స్ ఫీజులు, వేలం తదితర వాటితో జమవుతున్న మొత్తం సిబ్బంది జీతభత్యాలు, ఖర్చులకే సరిపోవడం లేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలతోనే మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. ఇప్పటికే ప్రారంభమైన అమృత్ పథకం కింద తాగునీటి సరఫరా కోసం పైపులైన్లు, ట్యాంకులు నిర్మాణం జరుగుతున్నాయి. పార్కులు, అంతర్గత రోడ్ల విస్తరణ, అవసరమైన వంతెన, విద్యుత్ దీపాలు, పా ర్కుల అభివృద్ధి, మరమ్మతులు చేయాల్సి ఉంది. విద్య, వైద్యం, పౌరసేవలు ఇంకా మెరుగుపర్చాల్సి ఉంది. ఇప్పటికే ప్రారంభించిన పనులు పూర్తి చేయాల్సి ఉంది. కొన్ని చోట్ల నిధులు విడుదల కాక మధ్యలోనే నిలిచిపోయాయి.


