‘గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం’ | - | Sakshi
Sakshi News home page

‘గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం’

Feb 27 2026 4:13 AM | Updated on Feb 27 2026 4:13 AM

‘గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం’

‘గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం’

కాసిపేట: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ తెలిపారు. గురువారం మండలంలోని తాటిగూడ, మద్దిమాడ గ్రామ పంచాయతీల నూతన భవనాలను ప్రారంభించారు. టీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కోలాంగూడ వరకు రూ.1.40కోట్లతో, పీఆర్‌ రోడ్డు నుంచి కొత్త తిరుమలాపూర్‌ వరకు రూ.1.43కోట్లతో బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మండలంలో అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు సాగుతున్నామని, అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తాటిగూడ సర్పంచ్‌ మడావి వెంకటేష్‌, మద్దిమాడ సర్పంచ్‌ దివ్య, డీపీఓ వెంకటేశ్వర్‌రావు, డీఎల్‌పీఓ సతీష్‌, ఎంపీఓ సబ్దర్‌ఆలీ, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్‌, ఏఈ జగన్‌, డీటీ అంజయ్య, కాంగ్రెస్‌ నాయకులు పుస్కూరి విక్రమ్‌రావు, తిరుపతిరెడ్డి, ఆడ జంగు, సత్తయ్య, ప్రశాంత్‌, అట్టెపల్లి శ్రీనివాస్‌, రాపర్తి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement