దేశంలోనే తొలిసారి పాలమూరులో అబ్బురం | Paramotor Championship starts in MahabubNagar | Sakshi
Sakshi News home page

పాలమూరులో అబ్బురపరుస్తున్న ఎయిర్‌ షో

Jan 13 2021 2:00 PM | Updated on Jan 13 2021 2:01 PM

Paramotor Championship starts in MahabubNagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహబూబ్‌నగర్‌లో బుధవారం జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. ఏరో స్పోర్ట్స్, పారా మోటార్ ఛాంపియన్ షిప్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. పది రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీపడుతున్న ఈ ఉత్సవాలు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ, వరల్డ్‌ అడ్వెంచర్స్‌, ఎయిర్‌ స్పోర్ట్స్‌ ఎయిర్‌ షో ఆధ్వర్యంలో హాట్‌ ఎయిర్‌ బెలూన్‌, స్కై డైవింగ్‌, పారా మోటార్‌ విన్యాసాలు జరుగుతున్నాయి. ఆకాశంలో మోటార్ పైలెట్ల విన్యాసాలు అబ్బురపరిచాయి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్‌ షో, పారామోటార్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. 

హర్యానా, పంజాబ్‌, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాలకు చెందినవారు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఆరు టాస్క్‌లలో ఈ పోటీలు జరగనున్నాయి. గతేడాది గాలిపటాల ఉత్సవాలను నిర్వహించగా ఈసారి అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించారు. అన్ని రంగాల్లో పాలమూరు జిల్లా అభివృద్ధి చెందుతోందని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పారు. త్వరలోనే అతిపెద్ద పరిశ్రమ మహబూబ్‌నగర్‌ జిల్లాకు రాబోతుందని ప్రకటించారు. దేశంలోనే తొలి ఏరో స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను జిల్లాలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.

1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement
 
Advertisement
Advertisement