నారాయణపేట: నారాయణపేట జిల్లా ఊట్కూర్‌లో 2015లో వినాయక నిమజ్జనం సందర్భంగా చోటుచేసుకున్న మత ఘర్షణ కేసును నారాయణపేట సీనియర్ సివిల్ కోర్టు కొట్టివేసింది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించి అప్పటి గ్రామ సర్పంచ్ ఎం.భాస్కర్‌తో పాటు మరో 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై 11 ఏళ్లుగా నారాయణపేట సీనియర్ సివిల్ కోర్టులో విచారణ కొనసాగింది. విచారణ సందర్భంగా పోలీసులు సరైన ఆధారాలు, సాక్ష్యాలు ప్రవేశపెట్టలేకపోవడంతో బుధవారం సీనియర్ సివిల్ జడ్జి కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది నాగురావు నామాజీతో పాటు న్యాయవాదులు నందు నామాజీ, ప్రవీణ్ నామాజీ, శ్రీకాంత్ వాదనలు వినిపించారు. తమ తరఫున వాదించిన న్యాయవాదులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
● ఊట్కూర్ వినాయక నిమజ్జనం ఘటనలో 25 మందికి ఊరట


