బకాయిలు చెల్లించేలా సీఎం దృష్టికి తేవాలి | - | Sakshi
Sakshi News home page

బకాయిలు చెల్లించేలా సీఎం దృష్టికి తేవాలి

Nov 19 2026 3:19 AM | Updated on Nov 19 2026 3:19 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: తమకు రావాల్సిన బకాయిల చెల్లింపునకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎ.రాజసింహుడు బుధవారం స్థానిక పద్మావతికాలనీలోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడల విభాగం) ఏపీ జితేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు పింఛను లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు అంజన్నయాదవ్‌, వహీద్‌, నాగాంజనేయులు, బొక్కా నర్సింహులు, రాంరెడ్డి, రిజాజొద్దీన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement