లేదు! | - | Sakshi
Sakshi News home page

లేదు!

Nov 19 2026 3:19 AM | Updated on Nov 19 2026 3:19 AM

ఆకర్షణీయ దుకాణాల మాటున అనారోగ్యం

లైసెన్స్‌

నాణ్యత

పాలమూరు: నగరంలో ఆకర్షణీయమైన హంగులతో వెలుస్తున్న డ్రైఫ్రూట్స్‌ దుకాణాల్లో ఆహార భద్రత ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అద్దాల అలంకరణలు, రంగురంగుల లైటింగ్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటున్న కొన్ని దుకాణాలు సరైన అనుమతులు, లైసెన్సులు లేకుండానే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నాణ్యతపై పర్యవేక్షణ కొరవడటంతో వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి.

అంజీరలో పురుగులు.. ఫిర్యాదుతో కదలిక

నగరంలోని వెంకటేశ్వర కాలనీలో ఓ డ్రైఫ్రూట్స్‌ దుకాణంలో రెండు రోజుల క్రితం ఓ వినియోగదారుడు ఎండు అంజీర కొనుగోలు చేశాడు. వాటిని ఇంటికి తీసుకెళ్లి నీటిలో నానబెట్టగా తెల్లటి పురుగులు కనిపించడంతో దుకాణ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా, వినియోగదారుడితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ ఘటనను బాధితుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. అనంతరం జిల్లా ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీలత బృందం బుధవారం సదరు దుకాణంలో తనిఖీలు చేపట్టింది. గతంలో రెండుసార్లు సందర్శించి రాష్ట్రస్థాయి లైసెన్స్‌ తీసుకోవాలని సూచించినప్పటికీ నిర్వాహకులు పట్టించుకోలేదని అధికారులు తెలిపారు. తనిఖీల్లో దుకాణానికి లైసెన్స్‌ లేకపోవడంతో పాటు, డ్రైఫ్రూట్స్‌ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారనే వివరాలు, హోల్‌సేల్‌ బిల్లులు కూడా లభించలేదని పేర్కొన్నారు. వివిధ ఉత్పత్తుల నమూనాలు సేకరించి, లైసెన్స్‌ పొందే వరకు దుకాణాన్ని సీజ్‌ చేశారు. ల్యాబ్‌ నివేదిక ఆధారంగా నిర్వాహకులపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా డ్రైఫ్రూట్స్‌ విక్రయాలు

ఎండు అంజీరలో పురుగులు.. అధికారులకు వినియోగదారుడి ఫిర్యాదు

తనిఖీలు నిర్వహించి దుకాణాన్ని సీజ్‌ చేసిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ బృందం

మరో రెండు దుకాణాలకు, హోటల్‌కు నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement