మా బతుకులను ముంచొద్దు | - | Sakshi
Sakshi News home page

మా బతుకులను ముంచొద్దు

Nov 19 2026 3:19 AM | Updated on Nov 19 2026 3:19 AM

బల్మూర్‌: తమ జీవనాధారమైన భూములను కోల్పోయి రోడ్డున పడలేమని అనంతవరం రైతులు స్పష్టం చేశారు. శ్రీ ఉమామహేశ్వర రిజర్వాయర్‌ నిర్మాణం పేరుతో భూములు సేకరిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. ప్రాజెక్టుతో పంట భూములకే కాకుండా గ్రామాల మనుగడకూ ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం అనంతవరం గ్రామంలో సర్పంచ్‌ అంజనమ్మ అధ్యక్షతన భూసేకరణపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామ శివారులో సుమారు 205 ఎకరాల భూసేకరణకు సంబంధించి అధికారులు రైతుల అభిప్రాయాలను సేకరించగా.. వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరో చోట నిర్మించండి

పేద, చిన్న, సన్నకారు రైతులమైన తాము వ్యవసాయ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోతే తమ కుటుంబాల జీవనాధారం దెబ్బతింటుందని పేర్కొన్నారు. రిజర్వాయర్‌ నిర్మాణంతో భవిష్యత్తులో గ్రామాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం సరికాదన్నారు. బల్మూర్‌ మండలంలోని రామగిరి, రుసుల చెరువు, తెగిపోయిన చెరువు పరిసర ప్రాంతాల్లో రిజర్వాయర్‌ నిర్మాణానికి అనువైన భూములు ఉన్నాయని రైతులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రాజెక్టు నిర్మాణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కోరారు. తమ ప్రాంతంలోనే రిజర్వాయర్‌ నిర్మించాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించి, అనంతవరం వద్ద ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

205 ఎకరాల భూసేకరణపై రైతుల ఆగ్రహం

భూములే కాదు.. గ్రామాలకూ ముప్పు ఉందని ఆందోళన

ప్రత్యామ్నాయ ప్రాంతంలో రిజర్వాయర్‌ నిర్మించాలని డిమాండ్‌

మినిట్స్‌పై సంతకాలు చేయకుండా నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement