మహబూబ్‌నగర్ క్రీడలు: బోడుప్పల్‌లో మంగళవారం ముగిసిన ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో జిల్లాకు చెందిన ఆర్.అభిజిత్ ప్రతిభ చాటారు. అండర్–13 బాలుర డబుల్స్ విభాగంలో అభిజిత్ తోటి క్రీడాకారుడు ఆరూష్ నడింపల్లితో కలిసి విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా అభిజిత్‌ను మహబూబ్‌నగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్‌గౌడ్, ఎల్.రవికుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి సాదత్‌ఖాన్ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


