కాంట్రాక్టు కార్మికుల వినూత్న నిరసన | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు కార్మికుల వినూత్న నిరసన

Nov 19 2026 3:07 AM | Updated on Nov 19 2026 3:07 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్‌ కేర్‌, సూపర్‌వైజర్‌ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన ఆందోళన ఏడో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా బుధవారం వారు ఎంజీజీహెచ్‌ ఆవరణ నుంచి ఉరితాళ్లకు వేలాడేలా రాయచూర్‌ ప్రధాన రహదారి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్‌ మాట్లాడుతూ కార్మికుల కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, ఉద్యోగ, సామాజిక భద్రత కల్పించాలన్నారు. కాలపరిమితి ముగిసిన ప్రైవేట్‌ ఏజెన్సీలను రద్దు చేయాలని, పండుగ సెలవులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు రంగన్న, చెన్నయ్య, బాలరాజ్‌, బుచ్చన్న, అంజిలయ్య, మన్యం, యాదగిరి, గోపాల్‌, శ్రీనివాసులు, జ్యోతి, నాగమ్మ, సత్యమ్మ, పద్మ, భాగ్యలక్ష్మి, చిట్టెమ్మ, శిరీష తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement