నగరంలో కొందరు వడ్డీ వ్యాపారులు చిరు వ్యాపారులకు రోజువారీ వాయిదాల పద్ధతిలో అప్పులిస్తున్నారు. ఉదాహరణకు రూ.10 వేల అప్పు ఇస్తూ ముందుగానే రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు వడ్డీ, ఇతర చార్జీల పేరుతో మినహాయించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. మిగిలిన మొత్తాన్ని ఇచ్చి రోజుకు రూ.100 చొప్పున వంద రోజుల పాటు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా చిన్న మొత్తాల అప్పులే చివరకు పెద్ద భారంగా మారుతున్నాయి. రోజువారీ సంపాదనలో అధిక భాగం వాయిదాలకే చెల్లించాల్సి రావడంతో చిరు వ్యాపారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.


