అర్హత కలిగిన సంఘాలు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. యంత్రాలు, పరికరాల ఎంపిక, డీలర్ల ఎంపిక, బిల్లుల పరిశీలన, నేరుగా తనిఖీ తదితర ప్రక్రియలు నిబంధనల ప్రకారం జరుగుతాయి. ఎంపిక చేసిన పరికరాల ధరలు రాష్ట్రస్థాయిలో సూచించిన గరిష్ట ధరలకు మించకూడదు. జిల్లాల్లో పథకం అమలుకు వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీ పథకం అమలును పర్యవేక్షిస్తుంది. జిల్లా వ్యవసాయ అధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి..
కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా యంత్రాలను వినియోగించుకుంటే రైతులకు చాలా మేలు జరుగుతుంది. ఆ యంత్రాలను వ్యక్తిగతంగా కొనుగోలు చేయాలంటే రైతులకు చాలా భారం. కాబట్టి మహిళా, రైతు సంఘాలు, పీఏసీఎస్‌ల ద్వారా తీసుకొని రైతులకు అద్దెకు ఇస్తే వీరికి ఉపాధితోపాటు రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఆసక్తి గలవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కావాల్సిన యంత్రాలు మరిన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. నాలుగు నెలల్లో ఈ పథకాన్ని పూర్తి చేయాలని ఆదేశాలున్నాయి.
– యశ్వంత్‌రావు, డీఏఓ, నాగర్‌కర్నూల్
●


