అధిక వడ్డీలకు అప్పులిచ్చి ఎవరినైనా వేధింపులకు గురిచేస్తే బాధితులు నేరుగా పోలీసులను ఆశ్రయించాలి. వాహనాలను తాకట్టు పెట్టుకోవడం, భూములను రిజిస్ట్రేషన్ చేసుకుని అప్పులు ఇవ్వడం, ఫైనాన్స్ పేరుతో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడటం వంటి అంశాలపై ఫిర్యాదులు అందితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. బాధితులు తమ పరిధిలోని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. అక్రమ వడ్డీ వ్యాపారాలు, వేధింపులకు పాల్పడే వ్యక్తులపై నిఘా పెడతాం. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ
●


