డప్పు చప్పుళ్ల హోరు.. దున్నరాజుల జోరు | - | Sakshi
Sakshi News home page

డప్పు చప్పుళ్ల హోరు.. దున్నరాజుల జోరు

Nov 19 2026 3:07 AM | Updated on Nov 19 2026 3:07 AM

హన్వాడ: అందంగా అలంకరించిన బలిష్టమైన దున్నరాజుల విన్యాసాలు.. యువకుల ఆటపాటలు.. కేరింతలు.. డప్పు చప్పుళ్ల హోరుతో హన్వాడ మార్మోగింది. బుధవారం హన్వాడలో పల్లె సంస్కృతి, పశుపోషణ వైభవానికి అద్దం పట్టేలా నిర్వహించిన సదర్‌ వేడుకలకు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై దున్నపోతులతో విన్యాసాలు చేయించారు. అనంతరం యాదవులకు సదర్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. ‘సదర్‌ ఉత్సవాలు కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా.. యాదవుల వీరత్వం, పశుసంపద పట్ల వారికి ఉన్న ప్రేమ, సామాజిక ఐక్యతకు నిదర్శనం అని కొనియాడారు. తరతరాలుగా వస్తున్న గొప్ప గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాద్యత అందరిపై ఉందన్నారు. సదర్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన నిర్వాహకులు, యాదవులను ఆయన అభినందించారు. ఇదిలా ఉండగా.. సదర్‌ ఉత్సవాలకు మాజీ మంత్రి రావడంతో యాదవ సామాజిక వర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పెద్దల జోక్యంతో పరిస్థితి సద్దుమణగడంతో వేడుకలు యథావిధిగా కొనసాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement