తిమ్మాజిపేట: రైతులు సాగునీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకొని పంటలు పండించుకోవాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి సూచించారు. మండలంలోని చేగుంట, భూత్పూర్ మండలంలోని వెల్కిచర్ల చెరువులకు సాగునీటిని మళ్లించేందుకు కేఎల్‌ఐ కాల్వ వద్ద లిఫ్టు పంపులను ప్రారంభించారు. మండలంలోని చేగుంట సమీపంలో కేఎల్‌ఐ కాల్వ నుంచి నీటిని లిఫ్టు చేసేందుకు గతంలోనే మోటార్లు బిగించారు. ఈ క్రమంలో శుక్రవారం ఎమ్మెల్యేలు మోటార్లను ప్రారంభించి, కాల్వలో పూలు వేసి గంగమ్మకు పూజలు చేశారు. కేఎల్‌ఐ నీటితో ఆయా గ్రామాల చెరువులు, కుంటలు నింపుతామన్నారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ బోర్లు, బావుల్లో నీటి మట్టం పెరుగుతుందని, ఈ నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యేలు రైతులకు సూచించారు.
ఎమ్మెల్యేలకు ఘనస్వాగతం
కేఎల్‌ఐ కాల్వ నీటిని విడుదల చేసేందుకు చేగుంట గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ సురేందర్‌రెడ్డికి స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు డప్పులు, మేళతాళాలతో స్వాగ తం పలికి శాలువలతో ఘనంగా సత్కరించారు.


