అట్టహాసంగా హ్యాండ్‌బాల్‌ టోర్నీ | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా హ్యాండ్‌బాల్‌ టోర్నీ

Nov 14 2026 1:11 AM | Updated on Nov 14 2026 1:11 AM

● పాలొన్న ఉమ్మడి జిల్లాల బాలబాలికల జట్లు

● మహబూబ్‌నగర్‌ బాలుర జట్టు

శుభారంభం

● 15–8 గోల్స్‌ తేడాతో నిజామాబాద్‌పై

విజయం

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మహబూబ్‌నగర్‌ హై స్కూల్‌లో శుక్రవారం రాత్రి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ బాల, బాలికల అండర్‌–17 రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రస్థాయి పోటీల్లో తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాల బాల, బాలికల జట్లు పాల్గొన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత

రాష్ట్రస్థాయి అండర్‌–17 ఎస్‌జీఎఫ్‌ హ్యాండ్‌బాల్‌ బాల, బాలికల చాంపియన్‌షిప్‌ను అర్బన్‌ ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా ఆయనతోపాటు పలువురు అతిథులు జ్యోతిప్రజ్వలన చేశారు. క్రీడా పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. ఆటలు ఆడితే శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండవచ్చన్నారు. రాష్ట్రస్థాయి టోర్నీలో ఉమ్మడి జిల్లాల బాల, బాలికల జట్లు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండి క్రీడల్లో పాల్గొనాలని కోరారు. జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ హ్యాండ్‌బాల్‌ పోటీల్లో ఆయా ఉమ్మడి జిల్లాల జట్లకు మహబూబ్‌నగర్‌ హై స్కూల్‌, హీరా మాడల్‌ స్కూళ్లలో వసతి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రెండు మైదానాల్లో లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతి లో మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. ఈనెల 15వ తేదీన రాష్ట్రస్థాయి టోర్నీ ముగింపు వేడుకలు ఉంటాయని, అందరి సహకారంతో రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. క్రీడాకారులు ప్రతిభచా టి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ టోర్నీ పరిశీలకులు శ్రీనివాస్‌ (బాలుర), శ్రీదేవి (బాలికల), పెటాటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహన్‌గౌడ్‌, మహబూబ్‌నగర్‌ హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ శాంత, రజినికాంత్‌రెడ్డి, జియావుద్దీన్‌, బాల్‌రాజు, రవికుమార్‌, నర్సింహారెడ్డి, ప్రదీప్‌కుమార్‌, అహ్మద్‌ హుస్సేన్‌, వినోద్‌కుమార్‌, నాగభూషణం, ముహిబర్‌ రహెమాన్‌, ఉబేద్‌ ఉర్‌ రబ్‌, రంజిత్‌కుమార్‌, సర్ఫరాజ్‌, రంజిత్‌కుమార్‌, నర్సింహ, శివుడు పాల్గొన్నారు.

శుభారంభం చేసిన మహబూబ్‌నగర్‌ బాలుర

స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–17 రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య మహబూబ్‌నగర్‌ ఉమ్మడి బాలుర జట్టు శుభారంభం చేసింది. మహబూబ్‌నగర్‌ హై స్కూల్‌ మైదానంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ బాలుర జట్టు 15–8 గోల్స్‌ తేడాతో నిజామాబాద్‌ జట్టుపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో వరంగల్‌ బాలుర జట్టు 18–06 గోల్స్‌ తేడాతో మెదక్‌ జట్టుపై గెలుపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement