అలంపూర్ క్షేత్రంలో రథోత్సవం
అలంపూర్: అలంపూర్ క్షేత్రం కార్తీక దీపాల కాంతులతో వెలుగొందింది. పవిత్ర పుణ్య మాసం కార్తీకం తొలి శుక్రవారం కావడంతో ఈ క్షేత్రంలో వెలిసిన జోగుళాంబ అమ్మవారు, శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వా మివారి దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకొని భక్తులు ఆలయ సముదాయంలో కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంత రం స్వామి, అమ్మవార్ల ఆలయాను సందర్శించి అ భిషేకాలు, అర్చనలు, కుంకుమార్చన పూజలు విశేషంగా నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణాలు జనసందోహంతో సందడిగా మారాయి. స్వామి, అమ్మవారి నామస్మరణ తో ఆ ప్రాంతం అధ్యాత్మిక వాతా రవణం సంతరించుకుంది. అదేవిధంగా జోగుళాంబ అమ్మవారి ఆలయంలో చండీహోమాలు ప్రత్యేకంగా జరిగాయి. సాయంత్ర రథోత్సవం కనుల పండవగా నిర్వహించారు. ఆలయ అర్చక స్వాము లు రథంలో కొలువైన జోగుళాంబ మాతకు విశేష పూజలు చేశారు. అనంతరం మేళతాల మధ్య భక్తులు రథాన్ని ముందుకు కదిలంచారు. అమ్మవారు, స్వామివారికి జేజేలు పలుకుతూ భక్తులు రథోత్సవాన్ని కొనసాగించారు.
తొలి శుక్రవారానికి తరలొచ్చిన భక్తులు
ఆలయాల్లో కార్తీక దీపాలతోపూజలు
అమ్మవారి ఆలయంలో
చండీ హోమాలు
రమణీయంగా రథోత్సవం


