ముగిసిన ఉమ్మడి జిల్లా క్రీడాపోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఉమ్మడి జిల్లా క్రీడాపోటీలు

Nov 14 2026 1:11 AM | Updated on Nov 14 2026 1:11 AM

వనపర్తి రూరల్‌: క్రీడల ద్వా రా క్రమ శిక్షణ, సమైక్యత భా వన పెంపొందించుకోవాలని డీసీఓ శ్రీవేణి అన్నారు. మండలంలోని చిట్యాల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం ప్రిన్స్‌పాల్‌ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి జిల్లా అండర్‌– 17 క్రీడల ముగింపు కార్యక్రమంలో కళాశాల ప్రిన్స్‌పాల్‌ గురువయ్యగౌడ్‌ , ఆమె ముఖ్య అతిథులుగా పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ మైదానంలో విజయం సాధించగలిగితే నిజమైన విద్యార్థిగా నిలుస్తారని అన్నా రు. విద్యతోపాటు క్రీడలు కూడా ప్రతి విద్యార్థిలో క్రమ శిక్షణ ,జట్టు భావన ,ఆత్మవిశ్వాసం పెంపొంది స్తాయి. గెలవడం కంటే పాల్గొనడం ముఖ్యం. క్రీడల్లో నేర్చుకున్న ఓర్పు, సహనం పెరిగి జీవితంలో విజయం సాధించడానికి తోడ్పాడతాయన్నారు. అనంతరం వందేమాతం గీతం ఆలపించి క్రీడల ను ముగించారు. కళాశాల ప్రిన్స్‌పాల్‌ గురువయ్య గౌడ్‌ మాట్లాడుతూ ఈ క్రీడా పోటీల్లో ఉమ్మడి జిల్లా లోని 14 పాఠశాలల నుంచి 490 విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. వీరిలో కబడ్డీలో ప్రథమ బహు మతి తెల్కపల్లి ఎంజేపీ, దిత్వీయ బహుమతి నారాయణపేట్‌ ఎంజేపీ, ఖోఖోలో ప్రథమ బహుమతి నారాయణపేట్‌ ఎంజేపీ, ద్వితీయ తెల్కపల్లి ఎంజేపీ, వాలిబాల్‌లో ప్రథమ ధర్మాపూర్‌ ఎంజేపీ, ద్వితీయ న్యూ మక్తల్‌, చెస్‌ పోటీల్లో పథమ ధర్మాపూర్‌, ద్వితీయ న్యూ మక్తల్‌, 100 మీటర్ల పరుగు పందెంలో మొదటి బహుమతి కార్తిక్‌ చిట్యాల ఎంజేపీ, ద్వితీయ మహేష్‌ ధర్మాపూర్‌, తృతీయ సందీప్‌ చిట్యాల , 400 మీటర్ల పరుగు పందెంలో సందీప్‌ ఎంజేపీ చిట్యాల, ద్వితీయ మహేష్‌ ఎంజేపీ ధర్మాపూర్‌, తృతీయ జశ్వంత్‌ అంబటిపల్లి, 800 మీటర్లు ప్రథమ బహుమతి జశ్వంత్‌ అంబట్‌పల్లి, ద్వితీయ మహేష్‌ ధర్మాపూర్‌, తృతీయ అజయ్‌ అంబట్‌పల్లి, 1500 మీటర్లు ప్రథమ జశ్వంత్‌ అంబట్‌పల్లి, ద్వితీయ మహేష్‌ ధర్మాపూర్‌, తృతీయ వెంకటేష్‌ కల్వకూర్తి , షార్ట్‌ ఫుట్‌ ప్రథమ అకిల్‌ నాయుడు, చిట్యాల ద్వితీయ తరుణ్‌ సింగోటం, ద్వితీయ కార్తిక్‌ , డిస్కోత్రో ప్రథమ జె వంశి చిట్యాల, ద్వితీయ సాయికార్తిక్‌ చిట్యాల, తృతీయ వంశీ అంబట్‌పల్లి, హైజంపులో ప్రథమ రాకేష్‌ శాంతినగర్‌, ద్వితీయ భగీరథ కడుకుంట్ల, తృతీయ రఘుపతి ఓల్డ్‌ మక్తల్‌, లాంగ్‌ జంపులో ప్రతమ కార్తీక్‌ చిట్యాల ,జశ్వంత్‌ అంబట్‌పల్లి , తృతీయ బహుమతి రఘుపతి ఓల్డ్‌ మక్తల్‌ గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement