నిందితుడికి మూడేళ్ల జైలు, జరిమానా | - | Sakshi
Sakshi News home page

నిందితుడికి మూడేళ్ల జైలు, జరిమానా

Nov 14 2026 1:11 AM | Updated on Nov 14 2026 1:11 AM

పాన్‌గల్‌: హత్యాయత్నం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ జిల్లా అసిస్టెంట్‌ సెషన్‌ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించినట్లు ఎస్‌ఐ కుర్మయ్య తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గోప్లాపూర్‌ గ్రామానికి చెందిన లక్ష్మయ్య, దాసు పై ఇదే గ్రామానికి చెందిన బింగి శ్రీశైలం హత్యాయత్నం చేశాడు. దీంతో శ్రీశైలంపై 2023 సంవత్సరంలో కేసు నమోదైంది. ఈ క్రమంలో విచారణ అనంతరం కేసు నిరూపించడంతో 307 ఐపీసీ కింద మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ శిక్ష ఖరారు చేశారు. ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసిన ఎస్‌ఐ కుర్మయ్యను, దర్యాప్తు అధికారులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, కోర్టు లైజనింగ్‌ అధికారులు, కోర్టు సిబ్బందిని వనపర్తి సీఐ రత్నం అభినందించారు.

లారీని ఢీకొట్టిన డీసీఎం.. డ్రైవర్‌ దుర్మరణం

మునగాల: లారీని వెనుక నుంచి డీసీఎం ఢీకొనడంతో డీసీఎం డ్రైవర్‌ మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగా ల మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. స్థాని క ఎస్‌ఐ మల్లు సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై మునగాల మండలకేంద్రంలోని ఫ్లైఓవర్‌పై కోదాడ నుంచి సూర్యాపేట మార్గంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు నారాయణపేట జిల్లా పగిడిమర్రి గ్రామానికి చెందిన సిద్ది బసవరాజు(47)గా పోలీసులు గుర్తించారు.

క్రేన్‌ ఢీకొని రైతు దుర్మరణం

గోపాల్‌పేట: క్రేన్‌ ఢీకొని ఓ రైతు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రం సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికు లు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నలువోతు విష్ణు (45) వ్యవసాయంతో పాటు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో తన భార్య కిష్టమ్మను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని కూలీ పని కోసం మండల కేంద్రం సమీపంలోని పద్మావతి గార్డెన్‌ వద్ద దింపాడు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా గార్డెన్‌ నుంచి ప్రధాన రహదారిపైకి వస్తున్న సమయంలో వనపర్తి వైపు నుంచి వచ్చిన క్రేన్‌ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విష్ణు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న భార్య కిష్టమ్మ అక్కడికి చేరుకుని భర్తను చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. స్థానికులు క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో వనపర్తి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విష్ణు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

11 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

మదనాపురం: అక్రమంగా నిల్వ ఉంచిన 11 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని మదనాపురం పోలీసులు శుక్రవారం పట్టుకున్నా రు. ఎస్‌ఐ వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో దుప్పల్లి గ్రామానికి చెందిన నల్లబోతుల అంజి ఇంట్లో అక్రమంగా రేషన్‌ బియ్యం నిల్వ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 11 క్వింటాళ్ల పీడీఎస్‌ (రేషన్‌) బియ్యం లభ్యమయ్యాయి. పోలీసులు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచా రం అందించారు. పౌరసరఫరాల శాఖ డిప్యూ టీ తహసీల్దార్‌ ఫిలిప్‌ ఘటనా స్థలానికి చేరుకుని, పట్టుబడిన బియ్యాన్ని పరిశీలించి రేషన్‌ బియ్యంగా నిర్ధారించారు.అనంతరం అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని భద్రత నిమిత్తం ఆత్మకూరు గోదాంకు తరలించారు. పౌరసరఫరాల శాఖ అధికారి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అనుమానాస్పదంగా మహిళ మృతి

మక్తల్‌: మక్తల్‌లో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన పట్టణంలో శుక్రవా రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాట కకు చెందిన ఫాతిమా (50) మూడేళ్ల క్రితం మక్తల్‌కు వచ్చి అద్దె ఇంట్లో ఉంటుంది. కుమారులు కర్ణాటకలో ఉండగా ఈమె ఇక్కడే ఒంటరిగా జీవించేది. అయితే శుక్రవారం ఇంట్లోనే దుస్తులు లేని స్థితిలో మృతదేహం కనిపించడంతో స్థానికంగా అనుమానాలకు తావిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి కుమారుడు ఆసిఫ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మక్తల్‌ ఎస్‌ఐ రేవతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement