వాట్సాప్‌ వైద్యంతో రోగి మృతి? | - | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ వైద్యంతో రోగి మృతి?

Nov 11 2026 1:25 AM | Updated on Nov 11 2026 1:25 AM

● వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ

● ప్రైవేట్‌ ఆస్పత్రి ఎదుట ఆందోళన

మహబూబ్‌నగర్‌ క్రైం: వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కుటుంబసభ్యుడు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబసభ్యులు ప్రైవేట్‌ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కంసాన్‌పల్లికి చెందిన శరణప్ప (30) గ్యాస్ట్రో సమస్యతో రెండు రోజుల క్రితం మహబూబ్‌నగర్‌ సత్యం చౌరస్తాలోని ఓ ప్రైవేట్‌ గ్యాస్ట్రో ఆస్పత్రిలో చేరాడు. అయితే, అతను ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి వైద్యుడు అందుబాటులో లేకుండా వాట్సాప్‌ ద్వారా ఇచ్చిన సూచనలతో కిందిస్థాయి సిబ్బంది చికిత్స అందించారని కుటుంబసభ్యులు ఆరోపించారు. కాలేయ సమస్యతో పాటు క్యాన్సర్‌ ఉందంటూ భయాందోళనకు గురిచేశారని, పరీక్షల పేరుతో కాలయాపన చేసి అత్యవసర వైద్యం అందించలేదని పేర్కొన్నారు. చికిత్స పేరుతో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారని, రోగిని చూసేందుకు కూడా అనుమతించలేదని ఆరోపించారు. చివరకు తమకు తెలియకుండానే మృతదేహాన్ని వెనుక ద్వారం నుంచి అంబులెన్స్‌లోకి తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న టూటౌన్‌ పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అనంతరం ఆస్పత్రి యాజమాన్యం, బాధిత కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదిరినట్లు సమాచారం. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని టూటౌన్‌ సీఐ ఇజాజుద్దీన్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీనివాసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement