మహబూబ్‌నగర్ క్రీడలు: మధ్యప్రదేశ్ రాష్ట్రం గదన్‌వరలో ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు జరగనున్న 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 నేషనల్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బాలుర జట్టుకు కోచ్‌గా జిల్లాలోని మహమ్మదాబాద్ మండలం నంచర్ల జెడ్పీహెచ్‌ఎస్ పీడీగా పనిచేస్తున్న అబ్దుల్లా బిన్ అహ్మద్ వ్యవహరించనున్నారు. అబ్దుల్లా గతంలో ఏడు పర్యాయాలు ఎస్‌జీఎఫ్ రాష్ట్ర క్రికెట్ జట్లకు కోచ్‌గా, రెండుసార్లు పాలమూరు యూనివర్సిటీ క్రికెట్ జట్లకు కోచ్‌గా వ్యవహరించారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
● 108లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు
వంగూరు: మండలంలోని కోనేటిపూర్ స్టేజీ సమీపంలో శ్రీశైలం హైవేపై శనివారం సాయంత్రం డీసీఎం, కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో డీసీఎంలో ప్రయాణిస్తున్న కాంతారావు, వెంకన్న కాళ్లు విరిగాయి. కారులో ఉన్న తండ్రీకొడుకులు లోకేష్, స్వరూప్‌కు చేతులు, తలపై గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది పాండు, మల్లేష్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపారు.
క్షతగాత్రులు


