పురుగులను పట్టు.. పరిశ్రమలు పెట్టు | - | Sakshi
Sakshi News home page

పురుగులను పట్టు.. పరిశ్రమలు పెట్టు

Nov 8 2026 5:17 AM | Updated on Nov 8 2026 5:17 AM

పురుగులు అనగానే చీడపీడలు కావని పట్టు పరిశ్రమలు నెలకొల్పి కాటన్‌తో పట్టు వస్త్రాలను తయారే చేసేందుకు ముడిసరుకు అందించవచ్చని కాటన్‌ గురించి రైతులకు వివరించారు. పట్టుపురుగుల పెంపకం, ఉసిరికాయలు, కాటన్‌ దారం తయారీ, వస్త్రాలు, దుస్తుల వ్యాపారం వంటి అంశాలను రైతులు తెలుసుకున్నారు. వృథా ఉన్న ఉరిసికాయలతో అలంకరణలు చూపించారు.

ధాన్యం మంత్రం.. ఎండబెట్టే యంత్రం

తేమ కారణంగా ధాన్యం పాడై రైతులు నష్టపోతుంటారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు యూరోప్‌ బెస్ట్‌ సెల్లింగ్‌ డ్రయర్‌ను మేళాలో ప్రదర్శించారు. రెండున్నర గంటల్లో 30 క్వింటాళ్ల ధాన్యాన్ని ఆరబెడుతుందని నిర్వాహకులు వివరించారు.

ఆర్గానిక్‌ సాగు

రసాయనాలకు దూరంగా ఉంటూ సేంద్రియ ఎరువుల తో పంటల సాగు ప్రాముఖ్యతను తెలి యజేసేందుకు టీజీ ఆర్గానిక్‌ స్టాల్‌ ఏర్పా టు చేశారు. సాంప్రదాయ పద్ధతులేకాకుండా ఆధు నిక సేంద్రియ విధానాలు అలలంబించాలని డీప్యూ టీ డైరెక్టర్‌ రోహిణి వివరించారు. ఆరోగ్యకరమైన దిగుబడులను అందించడానికి రైతులు ఆర్గానిక్‌ ఎరువులతో పంటలు పండించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement