కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలి

Nov 8 2026 5:17 AM | Updated on Nov 8 2026 5:17 AM

జడ్చర్ల టౌన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. శనివారం జడ్చర్ల మండలంలోని నాగసాల గ్రామంలో ఆయన ఆధ్వర్యంలోని సీపీఎం బృందం పర్యటించి ఎండిపోయిన పంటలను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుల ఆత్మహత్యలు పెరగకముందే పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. వరి పంటకు ఎకరాకు రూ.30 వేలు, కందులు, వేరుశనగ వంటి వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక, బోర్లలో నీరు అడుగంటడంతో అప్పులు చేసి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లాలో వలసలు ప్రారంభమయ్యాయని, ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టకపోతే రైతుల ఆత్మహత్యలు, వలసలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నవాబుపేట, మిడ్జిల్‌, మహమ్మదాబాద్‌, భూత్పూర్‌ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరారు. నాగసాల గ్రామానికి చెందిన ఎల్లయ్య, కేశవులు, శ్రీనివాసులు సాగు చేసిన వరి పంట పూర్తిగా ఎండిపోయిందని, హుసేన్‌ అనే రైతు రెండెకరాల్లో సాగు చేసిన కంది పంట కూడా దెబ్బతిన్నదని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రాములు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కిల్లె గోపాల్‌, కురుమూర్తి, దీప్లానాయక్‌, జగన్‌, యాదయ్య, సత్తయ్య, సాయిలు, నాగరాజు, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement