● మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్
● బీసీ మేధావుల సంఘం, ఉమ్మడి జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పండుగ సాయన్నపై డ్రాయింగ్, ఉపన్యాస పోటీలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): నిజాం పాలనలో దోపిడీకి గురైన పేదలు, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచి పోరాడిన తెలంగాణ ప్రజాయోధుడు పండుగ సాయన్న అని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ పేర్కొన్నారు. బీసీ మేధావుల సంఘం, ఉమ్మడి జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం క్రౌన్ ఫంక్షన్ హాల్‌లో పండుగ సాయన్న జీవిత చరిత్రపై డ్రాయింగ్, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పండుగ సాయన్న అంటే ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని, పేదలందరికీ చెందిన ప్రజా నాయకుడన్నారు. సంపన్నులు, భూస్వాములు, దొరల దోపిడీని ఎదిరించి, పేదల ఆకలి తీర్చిన తెలంగాణ రాబిన్‌హుడ్ అని కొనియాడారు. ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. పండుగ సాయన్న చరిత్రను నవలా రచయిత బెక్కం జనార్దన్ కండాంతరాల వరకు అందించిన గొప్ప వ్యక్తి అన్నారు. సాయన్న పేరుపై డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉమ్మడి జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. పండుగ సాయన్న చరిత్ర నిలిచిపోవాలని.. ఆయన చరిత్ర గ్రామగ్రామాల్లో తెలియజేసే ప్రయత్నం చేయడం జరిగిందన్నారు.
● డ్రాయింగ్ పోటీల్లో జూనియర్ విభాగంలో మొదటి బహుమతి ఇట్కలి చైతన్య, రెండో బహుమతి రూప, మూడో బహుమతి జాహ్నవి, సీనియర్ వి భాగంలో అక్షిత, అబ్దుల్, ముజామిన్ సాధించగా.. ఉపన్యాస పోటీల్లో జూనియ ర్స్ విభాగం సాయి, ముబాశిర, అనన్య, సత్యవతి, సీనియర్ విభాగంలో వీరేంద్ర, తమన్న, లాస్యచైతన్య బహుమతులు సాధించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు జమున, గౌరవాధ్యక్షురాలు వనజ, భాస్కర్, అంజిరెడ్డి, రామచందర్, భాను, రవికుమార్, మల్లికార్జున్, న్యాయ నిర్ణేతలుగా భీంపల్లి శ్రీకాంత్, మహేందర్ పాల్గొన్నారు.


